బాబు కాంగ్రెస్‌తో చీకట్లో చేతులు కలిపి దగాకోరు, లతుకోరు రాజకీయం చేసిండు. బాన్సువాడలో తన కులం, పార్టీ ఓట్లను కాంగ్రెస్‌కే వేయించిండు. అయినా తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు తలెత్తుకోలేకపోతున్నరు. బాబు పార్టీనెట్ల నడిపిస్తున్నడు? నారావారిపల్లె నుంచి పైసలు తెచ్చా? ఆయన పొలంల పైసల చెట్లు మొలిచినయా? ఎన్నికల్లో ఖర్చు కోసం అక్షయపాత్ర ఉందా? అంతా బాబు లెక్కనే ఉంటారనుకోవద్దు. ఒక్కరోజన్నా నీతికి బతికని ఆయనా నీతి గురించి మాట్లాడేది? రెండు ఇడ్లీలు, రెండు పుల్కాలు, ఒక్కడే కొడుకు అంటుంటే, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినయి? మద్యం కుంభకోణం కేసులో విచారణ జరపకుండా హైకోర్టు నుండి స్టే ఎందుకు తెచ్చుకున్నడు? లోకాయుక్త పరిధిలో సీఎంను చేర్చాలంటే ఎందుకు పారిపొయిండు? అన్నాహజారే తన ఇంటెనుకే ఉన్నడన్నట్టు ఇప్పుడు నీతులు చెప్తున్నడు’
No comments:
Post a Comment